విజయవాడ మధురానగర్‌లో ఒక ఆవు దూడకు బారసాల నిర్వహించటం అందరినీ ఆకట్టుకుంది. వి.వి.నరసరాజు రోడ్డులోని శ్రీకృష్ణ దేవాలయం గోశాలలోని గోవు ఒక దూడకు జన్మనిచ్చింది. సోమవారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులు ఆ దూడకు అంగరంగ వైభవంగా బారసాల కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీ అని నామకరణం చేశారు. ఊయలలో ఉంచి సంప్రదాయబద్ధంగా ఊపారు.
ఆవు దూడకు ఘనంగా బారసాల - cow barasala in vijayawada latest news
బారసాల అంటే మనుషులకు మాత్రమే వర్తిస్తుందనుకుంటే పొరపాటే... విజయవాడలోని ఓ దూడకు ఘనంగా బారసాల జరిపారు. లక్ష్మి అని ముద్దుగా పేరు పెట్టారు. ఊయలలో ఊపుతూ సంప్రదాయబద్ధంగా చేసిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.
![ఆవు దూడకు ఘనంగా బారసాల Baby Cow](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7543155-565-7543155-1591700596957.jpg)
శ్రీకృష్ణ మందిరంలోని గోశాలలో 2018 డిసెంబరులో దేవాలయం కోసం పుంగనూరు ఆవు దూడ కోనుగోలు చేశారు. అప్పటినుంచి మందిరంలో దాని ఆలనపాలనతో పాటు.. గో పూజలు చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరులో పుంగనూరు గోవు సూడి కట్టింది. ఈ ఏడాది మే 27న ఆ గోవుకు సంప్రదాయ పద్ధతిలో మందిరం కమిటీ శ్రీమంతం చేసింది. ఆ సమయంలో మహిళలకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేశారు. గతనెల 30న పుంగనూరు గోవు దూడకు జన్మనిచ్చింది. ఈ దూడకు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి ఊయలలో వేశారు. ఆలయ కమిటీ సభ్యులు సాంబశివరావు దంపతులు ఆవు దూడకు బారసాల చేసి లక్ష్మిగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నివారణ జాగ్రత్తలను పాటిస్తూనే గోవు దూడను ఊయలలో వేసి ఊపుతూ పూజలు చేసి హాజరైన అందరికీ తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:సిలబస్, బోధన సమయం కుదింపు దిశగా కేంద్రం