విజయవాడ నగర శివారులోని సింగ్ నగర్, పాయికాపురం ప్రాంతాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి. హెచ్ బాబూరావు పర్యటించారు. కొన్ని రేషన్ డిపోలdలో బియ్యం లేక పంపిణీ నిలిచిపోయిందని గుర్తించారు. మరికొన్ని డిపోల్లో కందిపప్పు, పంచదార స్టాక్ లేక పంపిణీ నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వలస కార్మికులకు కార్డు ఉన్నా ,లేకపోయినా రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నట్లు బాబూరావు తెలిపారు. పేదలకు ఉచితంగా ఇస్తామన్న 3 సిలిండర్ల మాటేమిటని ప్రశ్నించారు. హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
'ఉచితంగా ఇస్తామన్న 3 సిలిండర్ల సంగతేంటి?' - పాయికపురం, సింగ్ నగర్ లోపర్యాటించిని సీపీఎం కార్యదర్శి
విజయవాడ నగర శివారులోని సింగ్ నగర్, పాయికాపురం ప్రాంతాల్లో రేషన్, గ్యాస్ సమస్యలను సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.హెచ్ బాబూరావు పరిశీలించారు. కరోనా నేపథ్యంలో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఎక్కడా అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు.
రేషన్ దుకాణాలను పరిశీలించిన సీపీఎం కార్యదర్శి బాబూరావు