భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి.. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి వెల్లంపల్లి అన్నారు. మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు చేసిన నేత జగ్జీవన్ రామ్ అని మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు.
నెల్లూరులో..
వెంకటగిరిలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. తితిదే బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, బాలినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ యాచెందర, తిరుపతి వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ భవన్ లో ..
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం చేపట్టారు. పార్టీ నేతలు జగ్జీవన్ కు నివాళులర్పించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు జనార్ధన్, పరుచూరి అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గురజాల మాల్యాద్రి, బుచ్చి రాంప్రసాద్, బొద్దులూరి వెంకటేశ్వరరావు, కుమార్ స్వామి, దారపనేని నరేంద్ర పాల్గొన్నారు.
ఆంధ్రరత్న భవన్లో ..
భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉప ప్రధానిగా, స్వాతంత్య్ర ఉద్యమ నేతగా దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు.
గుంటూరులో..
గుంటూరులో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూ కళాశాల కూడలిలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, వైకాపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బాలయోగి గురుకుల పాఠశాలలో..
విశాఖ జిల్లా నర్సీపట్నం బాలయోగి గురుకుల పాఠశాలలో జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గురుకులం సిబ్బంది, దళిత హక్కుల పోరాట సమితి నేతలు పాల్గొన్నారు.
అనకాపల్లిలో..
అరుంధతి నగర్లో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి వైకాపా పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైకాపా కార్పొరేటర్లు కొణతాల నీలిమ, మందపాటి సునీత, జాజుల ప్రసన్న, లక్ష్మి ,పీలా లక్ష్మీ సౌజన్య పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి తెదేపా అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర పూలమాల వేసి నివాళులర్పించారు. తేదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో..
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో.. జగ్జీవన్ రామ్ జయంతి వేడుకులను వైభవంగా నిర్వహించారు. కలెక్టర్ హరి జవహర్ లాల్, సంయుక్త కలెక్టర్లలతో కలసి.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.