ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Crime News: విజయవాడలో బీటెక్ విద్యార్థి.. నరసరావుపేటలో ఇద్దరు అనుమానాస్పద మృతి - బీటెక్ విద్యార్థి సుధాకర్ డెడ్ బాడీ లభ్యం

AP Crime News: విజయవాడ శివారులో విద్యార్థి మృతదేహం గుర్తించారు. పెట్రోల్ పోసి తగులబెట్టిన ఆనవాళ్లు బట్టి హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో ఘటనలో పల్నాడు జిల్లా అనుమానాస్పద రీతిలో రెండు మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోవైపు అనంతపురం జిల్లాలో షార్ట్ సర్క్యూట్​తో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.

Dead body of B Tech student in Krishna district
కృష్ణ జిల్లాలో బీ టెక్ విద్యార్థి మృతదేహం

By

Published : May 10, 2023, 3:10 PM IST

AP Crime News : విజయవాడ శివారులో దారుణం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక పంట పొలాల్లో జమ్ముల జీవన్ అనే బీటెక్ విద్యార్థి మృతదేహం గుర్తించారు. పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన జీవన్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి స్నేహితుడు శ్యాం పుట్టిన రోజు వేడుకల కోసం జీవన్ ఇంటి నుంచి వెళ్లాడని తెలుస్తోంది. బర్త్ డే పార్టీలో ఫోన్ రావటంతో వెళ్లాడని స్నేహితులు చెబుతున్నారు. పెట్రోల్ పోసి తగులబెట్టిన ఆనవాళ్లను బట్టి హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అనుమానాస్పద రీతిలో రెండు మృతదేహాలు :పల్నాడు జిల్లా నరసరావుపేటలో అనుమానాస్పద రీతిలో రెండు మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి గాంధీ పార్కు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అదేవిధంగా స్టేషన్ రోడ్డులో మరో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇరువురి ముఖాలపై, ఒంటిపై రక్తపు గాయాలు ఉండటంతో ఒకటో పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

షార్ట్ సర్క్యూట్​తో ఇల్లు దగ్ధం.. అధికారులపై ఆగ్రహం : అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అనిత అనే చీరల వ్యాపారికి చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో షార్ట్ సర్క్యూట్​తో నాలుగు లక్షలు విలువ చేసే చీరలు, ఇంటి గృహోపకరణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఇంటిపై నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన గమనించి నీటితో మంటలను ఆర్పీ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. అలా కాకుండా ఇంటిలో నిద్రించి ఉంటే ప్రాణం నష్టం జరిగి ఉండేదని బాధిత మహిళ తెలిపింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమవుతుంటే విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదని బాధిత మహిళ తెలిపారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ఒకరు మృతి : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నన్నయ్య యూనివర్సిటీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి బృందంతో శ్రీకాకుళం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.

ఇవీ చదవండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details