ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏమి చేసినా ఇట్టే దొరికిపోతాడని ట్విట్టర్లో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. నిన్నటి వరకూ కుప్పంలో గెలిచామని కాలర్ ఎగరేసి, చంద్రబాబు పర్యటన అనగానే అడ్డుకుంటామని ప్రకటించి అడ్డంగా దొరికిపోయారని అన్నారు. గెలుపులో నిజాయితీ ఉంటే అడ్డుకునే పనేముంది జగన్మోహనా? దొంగ పనులు చెయ్యడం.. ఏ2 డైరెక్షన్ లో దొరికిపోవడం పంచాయతీ ఎన్నికల వేదికగా మరోసారి రుజువయ్యిందని ఆయన ట్విట్టర్లో విమర్శించారు.
ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ విడ్డూరంగా ఉంది: మర్రెడ్డి
రాష్ట్రంలో 5 కోట్ల జనాభాకు గాను 5 కోట్ల ఒక లక్ష మందికి పథకాలు అమలు చేస్తున్నట్లుగా జగన్ సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయటం విడ్డూరమని తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల ముసుగులో ప్రభుత్వ ఖజానా సొమ్మును జగన్ సొంత ఖజానాకు మళ్లించుకుంటున్నారని విమర్శించారు. జగన్ క్యాలెండర్‌పై మంత్రులంతా ఆలోచన లేకుండా అబద్ధాలతో ఊదరకొడుతున్నారని ఎద్దేవా చేశారు. అమ్మఒడి పేరుతో 14వేలు ఇచ్చి, నాన్న బుడ్డి ద్వారా 36వేలు రాబట్టారన్నారు. వాహనమిత్ర పేరుతో రూ.10వేలిచ్చి తప్పుడు కేసులతో అంతకు పది రెట్ల సొమ్ము రాబట్టారని ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వం అమలుచేసిన 36పథకాలను రద్దుచేసిన జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల కోసమే సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:
విశాఖ శారదాపీఠంపై ఎస్ఈసీకి ఫిర్యాదు