విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామంటూ.. కేంద్రం చేసిన ప్రతిపాదనపై.. తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేస్తున్న నిరాహార దీక్షకు తెదేపా నేత అయ్యన్నపాత్రుడు సంఘీభావం తెలిపారు. పోస్కో సంస్థకు, సీఎం జగన్‌కు మధ్యవర్తిగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారని అయ్యన్న ఆరోపించారు.
పోస్కో యాజమాన్యాన్ని కలిసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి పుణే ఎన్నిసార్లు వెళ్లారన్నదానికి.. తమ దగ్గర సాక్ష్యాలు సైతం ఉన్నాయని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేవంటున్నారని.. పోస్కోకు గనులు మన రాష్ట్రంలో ఉన్నాయా అని అయ్యన్న నిలదీశారు.