ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్మోహన్ రెడ్డిది తుగ్లక్ పాలన: అయ్యన్న పాత్రుడు - వైకాపా ప్రభుత్వంపై తెదేపా

వైకాపా ప్రభుత్వం 14 నెలల పాలనలో రూ. 18 వేల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు రద్దు చేసిందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ayyanna pathrudu comments on ysrcp government
వైకాపా ప్రభుత్వంపై అయ్యన్న వ్యాఖ్యలు

By

Published : Jul 14, 2020, 2:59 PM IST

సీఎం జగన్ పాలన తుగ్లక్ పాలన అనడంలో ఎలాంటి సందేహం లేదని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. 14 నెలల పాలనలో వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాలకు చెందిన రూ.18 వేల కోట్ల సంక్షేమ పథకాలను రద్దు చేసిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం నిర్మించిన 10 లక్షల ఇళ్లను ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు.

రంగుల పేరుతో రూ.3 వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఆ డబ్బుని ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణానికి వెచ్చిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇళ్ల స్థలాల పేరుతో తక్కువ ధర ఉన్న భూములను, ఎక్కువ ధరకు కొని ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల ముసుగులో రూ. 5వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇందులో అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details