ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పథకాల పేరుతో బీసీల నిధులు కొట్టేయడం ఏంటి..?' - తెదేపా నేత అయ్యన్నపాత్రుడు వార్తలు

బీసీలకు, విద్యార్థులకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఇతర పథకాల కోసం బీసీల నిధుల్లో కోత విధించారని మండిపడ్డారు. రీయంబర్స్​మెంట్​ను తగ్గించారని ఆరోపించారు.

ayyanapatrudu
ayyanapatrudu

By

Published : Apr 30, 2020, 6:16 PM IST

పథకాల పేరుతో బీసీల నిధులు కొట్టేయడం ఏంటని ముఖ్యమంత్రి జగన్​పై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 'బీసీల రిజర్వేషన్లను కట్ చేశారు. అమ్మ ఒడి కోసం 3500 కోట్లు, విద్యా దీవెనకు 202 కోట్ల రూపాయలు బీసీ నిధుల్లో కోత విధించారు. 5 ఏళ్లలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు వైఎస్సార్‌ ప్రభుత్వం 2,500 కోట్లు ఖర్చు పెడితే... మరో 2,400 కోట్ల రూపాయలు బకాయి పెట్టింది. ఆ బకాయిని మాజీ ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం చెల్లించింది. చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌కే 16 వేల కోట్లు రూపాయలను ఖర్చు పెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు 2,400 కోట్ల రూపాయలను కూడా చెల్లించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చంద్రబాబు ప్రభుత్వం 45 వేలు ఇస్తే, దానిని జగన్ ప్రభుత్వం 35 వేలకు తగ్గించి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారు' అని అయ్యన్నపాత్రుడు ట్వీట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details