హోం మంత్రి మేకతోటి సుచరితకు తెదేపా అధినేత చంద్రబాబును విమర్శించేంత స్థాయి లేదని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. రాష్ట్రానికి హోం మంత్రి అన్న విషయం మర్చిపోయి... బాధ్యత లేని వ్యక్తి మాదిరి ఆమె మాట్లాడుతున్నారని అన్నారు.
చంద్రబాబును విమర్శించే స్థాయి సుచరితకు లేదు: అయ్యన్నపాత్రుడు - ap home sucharitha latest news
రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. మంత్రి పదవిలో ఉన్న విషయం మర్చిపోయి ఆమె మాట్లాడుతున్నారని విమర్శించారు.
ayyana criticized home minister sucharitha
రాజకీయాల్లో పొగడ్తలు, విమర్శలు రెండు ఉంటాయన్న ఆయన... ఈ రెండింటికీ సంస్కారవంతంగా సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.