కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారులోని నున్న పవర్ గ్రిడ్ ప్రాంగణంలో అగ్ని ప్రమాదాలపై సిబ్బంది ఏవిధంగా స్పందించాలో తెలుపుతూ మాక్ డ్రిల్ నిర్వహించారు. పవర్ గ్రిడ్ సెక్యూరిటీ సిబ్బంది, క్షేత్ర స్థాయి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్నిమాపక వాహనం వచ్చేలోపు అందుబాటులో ఉన్న పరికరాలతో ఏవిధంగా మంటలను అదుపు చేయాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. క్షణాల్లో ఎలా స్పందించాలి అనే విషయంపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో పవర్ గ్రిడ్ సీనియర్ జీఎమ్కే ఆర్ అరుణాచలం, సీనియర్ డీజీఎమ్ఆర్ ఎస్వీఎల్ఎన్ నాగేశ్వరరావు, చీఫ్ మేనేజర్ రమేష్ బాబు ..సిబ్బంది పాల్గొన్నారు.
నున్నలో అగ్నిప్రమాదాలపై అవగాహన సదస్సు - నున్న పవర్ గ్రిడ్ ప్రాంగణం వార్తలు
కృష్ణా జిల్లా నున్న పవర్ గ్రిడ్ ప్రాంగణంలో అగ్నిప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అందుబాటులో ఉన్న పరికరాలతో మంటలను ఎలా ఆర్పాలో సిబ్బంది చూపించారు.
నున్నలో అగ్నిప్రమాదాలపై అవగాహన సదస్సు