కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద పల్స్ పోలియో ర్యాలీని జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వరకు జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మన దేశంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ ఇంతియాజ్ కోరారు. జనవరి 31న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదు ఏళ్లలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో..
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రెండు చుక్కలు వేయించండి.. పోలియోను నివారించండి అని వైద్యసిబ్బంది నినాదాలు చేశారు. ఈనెల 31న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బుక్కరాయసముద్రం మండల వైద్యాధికారి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అప్పుడే పుట్టిన చిన్న పిల్లల నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో వేయించాలని సూచించారు.
ఇదీ చదవండి: రాజ్‌భవన్‌లో గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన గవర్నర్