మత్తు పదార్ధాల వినియోగం వల్ల నష్టంపై అవగాహన ర్యాలీ - విజయవాడలో డ్రగ్ వారోత్సవాలు వార్తలు
విజయవాడలో 22 వరకు యాంటీ డ్రగ్ వారోత్సవాలు చేపడతామని డీసీపీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మత్తుపదార్ధాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్థామని స్పష్టం చేశారు.
విజయవాడ సీపీ కార్యాలయం నుంచి ఏఆర్ మైదానం వరకు పోలీసులు యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 22 వరకు యాంటీ డ్రగ్ వారోత్సవాలు చేపడతామని డీసీపీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సీఐడీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత్తు పదార్ధాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్థామని స్పష్టం చేశారు. ఎన్డీపీఎస్ చట్టంపై ప్రజలకు వివరిస్తామన్నారు. మత్తుకు యువత బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అక్రమ మద్యంపై అధికారుల ఉక్కుపాదం