ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రహదారి భద్రతపై వాహన చోదకులకు అవగాహన అవసరం' - Awareness rally at Road Safety Month

వాహన చోదకులు రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని నూజివీడు ప్రాంతీయ రవాణా అధికారి రవికుమార్, డీఎస్పీ బి. శ్రీనివాసులు చెప్పారు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి తుక్కులూరు ప్రాంతీయ రవాణా కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Awareness rally at Road Safety Month
రహదారి భద్రతా మాసోత్సవంలో అవగాహన ర్యాలీ

By

Published : Jan 28, 2021, 12:22 PM IST

వాహన చోదకులు రహదారి భద్రతపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని నూజివీడు ప్రాంతీయ రవాణా అధికారి రవికుమార్, నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు అన్నారు. పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి తుక్కులూరు ప్రాంతీయ రవాణా కార్యాలయం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీకి ఆయన హాజరయ్యారు.

32వ జాతీయ భద్రతా మహోత్సవాల సందర్భంగా ఈ ర్యాలీ చేశారు. రోడ్లపై వేగం కంటే ప్రాణం మిన్నగా భావించి సురక్షితమైన ప్రయాణాలు చేయాలని సూచించారు. రోడ్డు భద్రత పట్ల వాహనచోదకులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకే ర్యాలీ చేస్తున్నట్లు తెలిపారు. సీఐ వెంకటనారాయణ, ఎస్సై గణేష్, ఆటోలు, టాక్సీల డ్రైవర్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details