ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెళకువలు నేర్చుకున్నాం.. ఇక రయ్యంటూ దూసుకెళ్తాం.. - ladies car driving work shop in Vijayawada

కారు నడిపే విషయంలో ఆడవారు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అలాంటి మహిళా చోదకులకు మెళకువలు నేర్పేందుకు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జీతో మహిళా విభాగం, మహావీర్ స్కోడా సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ప్రసాదంపాడులోని స్కోడా షోరూమ్​లో.. కారు నడపటం, చిన్నపాటి సమస్యలు వచ్చినప్పుడు సొంతంగా పరిష్కరించుకోవడంపై మహిళలకు అవగాహన కల్పించారు.

మెళకువలు నేర్చుకున్నాం

By

Published : Nov 25, 2019, 1:56 PM IST

Updated : Nov 25, 2019, 4:26 PM IST

మెళకువలు నేర్చుకున్నాం.. ఇక రయ్యంటూ దూసుకెళ్తాం..

మహిళా చోదకులకు విజయవాడలో కారు డ్రైవింగ్​పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కారు ఎలా నడపాలి, కారులోని ఏయే విభాగాలపై పట్టుండాలి, అలైన్​మెంట్​లో తేడా వస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి, బ్రేక్ వేసినప్పుడు టైరు ఏ విధంగా ఆగుతుంది.. ఇలా అనేక అంశాలపై మహిళలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం షోరూంలోని కార్యశాలలో కారులోని అన్ని విభాగాలను పరిచయం చేస్తూ వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా తమకు అనేక మెళకువలు తెలిశాయని మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి తరచూ నిర్వహిస్తుంటే ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దూర ప్రయాణాలు చేసినప్పుడు ఇబ్బందులు తలెత్తితే అక్కడికక్కడే పరిష్కరించుకునే విధంగా మెళకువలు నేర్పించడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

Last Updated : Nov 25, 2019, 4:26 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details