కృష్ణాజిల్లా నూజివీడు మున్సిపల్ కార్యాలయంలో కొత్తగా నియమితులైన మహిళా మిత్ర సభ్యులకు వివిధ అంశాలపై డీఎస్పీ శ్రీనివాసులు అవగాహన కల్పించారు. చిన్నపిల్లలు, విద్యార్థులు, మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న వేధింపులు.. తదితర అంశాలలో మహిళ మిత్రులు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. సమాజంలో నైతిక విలువలు పతనం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వేధింపులు ఇతర సమస్యలతో సతమతమవుతున్నారని.. వారికి న్యాయపరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం మహిళ మిత్రలను ఏర్పాటు చేసిందని డీఎస్పీ అన్నారు.
నూజివీడులో మహిళామిత్రలకు అవగాహన సదస్సు - awareness programme mahila mitras in nuzivedu
మహిళలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వేధింపులు, ఇతర సమస్యలతో సతమతమవుతున్నారని.. వాటిని ఎదుర్కొనేందుకు అన్ని విధాల సహాయ, సహకారాలు అందించాడానికి ప్రభుత్వం... మహిళా మిత్రలను ఏర్పాటు చేసిందని... నూజివీడు డీఎస్పీ తెలిపారు.
![నూజివీడులో మహిళామిత్రలకు అవగాహన సదస్సు మహిళమిత్రలకు వివిధ అంశాలపై అవగాహన సదస్సు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5420746-586-5420746-1576726708925.jpg)
మహిళమిత్రలకు వివిధ అంశాలపై అవగాహన సదస్సు