కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో కరోనా వైరస్‌పై సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని రామకృష్ణ వివరించారు.
సీపీఐ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన సదస్సు - విజయవాడలో కరోనాపై అవగాహన సదస్సు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై... విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వైరస్ సోకకుండా ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని వక్తలు సూచించారు.
విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన సదస్సు