జన చైతన్యమే కరోనా వ్యాప్తి నివారణకు అసలైన మార్గమని ప్రముఖ వైద్యులు సమరం అన్నారు. విజయవాడ బెంజి కూడలిలో ఇండియన్ రెడ్ క్రాస్ సంఘం కరోనాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు రెడ్ క్రాస్ ప్రతినిధులు, వాలంటీర్లు అవగాహన కల్పించారు. విచిత్ర వేషధారణలో ప్లకార్డులు ప్రదర్శించారు. వ్యాధి సోకకుండా ఉండే మార్గాలను వివరించారు. జనతా కర్ఫ్యూని అందరూ పాటించాలని, వృద్ధులు, చిన్నపిల్లలు బయటికి రాకుండా చూసుకోవాలని కోరారు. రెడ్ క్రాస్ తరఫున మాస్కులు, శానిటైజర్లు జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నట్లు సంస్థ రాష్ట్ర శాఖ ఛైర్మన్ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
ప్రజా చైతన్యమే కరోనా నివారణకు మార్గం: సమరం - corona
విజయవాడ బెంజి సర్కిల్ వద్ద రెడ్ క్రాస్ సొసైటీ కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యుడు సమరం హాజరయ్యారు.
విజయవాడలో కరోనాపై అవగాహన కార్యక్రమం