వ్యాపారులకు కేంద్ర బడ్జెట్‌పై అవగాహన కల్పించటమే లక్ష్యంగా ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విజయవాడలో సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ చార్టర్డ్ ఎకౌంటెంట్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్ సంస్థ డైరెక్టర్లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. కొత్తకా ప్రవేశ పెట్టిన బడ్జెట్, పన్ను రాయితీలు, మినహాయింపులపై వ్యాపారుల సందేహలను నివృత్తి చేశారు. బడ్జెట్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. పన్నులు ఎవరికి వర్తిస్తాయి, పన్నుల చెల్లింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పన్ను ఎగవేయటానికి ఎటువంటి ఆస్కారం లేదనీ, పన్నుల విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన సవరణలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
కేంద్ర బడ్జెట్‌పై వ్యాపారులకు అవగాహన సదస్సు - విజయవాడలో కేంద్ర బడ్జెట్‌పై వ్యాపారులకు అవగాహన సదస్సు
కేంద్ర బడ్జెట్‌పై వ్యాపారులకు విజయవాడలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అవగాహన సదస్సు నిర్వహించింది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వ్యాపారులు, పలు అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర బడ్జెట్‌పై వ్యాపారులకు అవగాహన సదస్సు