రోడ్డు ప్రమాదాల్లో గాయాలైనవారిని ప్రాణాపాయం నుంచి ఎలా కాపాడాలి? వారిని ఎంత సమయంలోపు ఆసుపత్రికి తరలిస్తే క్షేమంగా ఉంటారు? సత్వరమే అందించాల్సిన చికిత్స విధానం ఏంటి? అన్న విషయాలపై..విజయవాడలో ప్రభుత్వ వైద్యులకు విమ్స్ ఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. రాష్ట్రంలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఆర్ధోపెడిక్, జనరల్ సర్జన్లు, నర్సులు ఇందులో పాల్గొన్నారు. రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి స్థానికంగా ఉండే వైద్యశాలల్లో సత్వరమే వైద్యం అందిస్తే ప్రాణహాని తగ్గుతుందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ దుర్గాప్రసాద్ అన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీపంలో ఉన్న 71 ఆసుపత్రుల్లో అత్యాధునిక సియామ్ మిషన్, టేబుళ్లను దశల వారీగా అందజేయనున్నామని తెలిపారు. హెల్మెట్లు వినియోగించకపోవటం వల్లే రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు అధికంగా మరణిస్తున్నారని విమ్స్ సంచాలకులు డాక్టర్ సత్యవరప్రసాద్ అన్నారు. ప్రమాదం జరిగిన గంటలోపు క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
'ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి తీసుకెళ్లాలి' - విజయవాడ
రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారిని గంటలోపు ఆసుపత్రికి తీసుకెళ్తే వారు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విమ్స్ సంచాలకులు డాక్టర్ సత్యవరప్రసాద్ అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయాలైనవారికి సత్వరం మెరుగైన వైద్య సేవలు అందించే విధానంపై విజయవాడలో ప్రభుత్వ వైద్యులకు శిక్షణనిచ్చారు.
అవగాహన సదస్సు