కృష్ణా జిల్లా నందిగామలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో పాము కాట్లపై.... అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్, నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్రావు పాల్గొన్నారు. పాము కాటుపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పాము కాటు బాధితులకు కావలసిన మందులు అందుబాటులో ఉంచామని చెప్పారు. రోగుల పట్ల డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రేమతో వ్యవహరించాలని ఎమ్మెల్యే జగన్మోహన్రావు సూచించారు.
నందిగామలో.. పాము కాటుపై అవగాహన శిబిరం - కృష్ణా జిల్లా నందిగామ
నందిగామలో అటవీ శాఖ ఆధ్వర్యంలో... పాము కాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలను అప్రమత్తం చేయాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు.
నందిగామలో పాము కాటుపై అవగాహన కార్యక్రమం