జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నగరపాలక సంస్థ, స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. డీసీపీ మేరీ ప్రశాంతి పాల్గొని మహిళల, బాలికల రక్షణకు ఉన్న చట్టాలను వివరించారు. ఆపదలను ఎలా ఎదుర్కోవాలి..ఎవరిని సంప్రదించాలి వంటి అంశాలపై డీసీపీ బాలికలకు అవగాహన కల్పించారు.
బాలికల రక్షణ చర్యలపై అవగాహన సదస్సు - విజయవాడ తుమ్మలపల్లి వార్తలు
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలికల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న రక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆపదలను ఎలా ఎదుర్కోవాలి..ఎవరిని సంప్రదించాలి వంటి అంశాలను డీసీపీ మేరీ ప్రశాంతి వివరించారు.
రక్షణ చర్యలపై అవగాహన
ప్రభుత్వం బాలికలు, మహిళల పట్ల తీసుకుంటున్న రక్షణ చర్యలపై వారం రోజులుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమారాణి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: "ఆలసించిన ఆశాభంగం.. సొంతింటి కల తీర్చుకునేందుకు ఇదే అవకాశం"