ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మత్తు పదార్థాలకు బానిస కావొద్దంటూ అవగాహన ప్రదర్శన - collector rally news

మత్తుకు బానిసలు కావొద్దని ప్రజలకు అవగాహన కలిగిస్తూ.. కృష్ణా జిల్లా కలెక్టర్​ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్​ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

awareness on drugs effect
డ్రగ్స్​ వినియోగంపై అవగాహనా ర్యాలీ

By

Published : Nov 30, 2020, 4:27 PM IST

మత్తు పదార్థాలకు బానిసలుగా మారొద్దంటూ విద్యార్థులతో కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ర్యాలీ నిర్వహించారు. 'సే నో టు డ్రగ్స్ ..సే యస్ టు లైఫ్' అనే నినాదంతో ప్రదర్శన చేశారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై విజయవాడలో అవగాహన కల్పించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని జిల్లా పాలనాధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారిని మత్తు వ్యసన విముక్తి కేంద్రాలకు పంపుతున్నామని చెప్పారు. గంజాయి, ఎల్​ఎస్​డీ, కొకైన్ వంటి పదార్థాలకు బానిసలై.. విలువైన భవిష్యత్​ నాశనం చేసుకుంటున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా.. తమ లక్ష్యం వైపు అడుగులు వేయాలని యువతకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

'యూఏపీఏ చట్టాన్ని రద్దు చేయండి'

ABOUT THE AUTHOR

...view details