కృష్ణా జిల్లా మైలవరంలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తిపై చిత్రకారులు పెయింటింగ్ వేశారు. జిల్లాలో పెయింటర్స్ అసోసియేషన్‌కు చెందిన కళాఆర్ట్స్, జాబిల్లి ఆర్ట్స్, దేవా ఆర్ట్స్‌కు చెందిన చిత్రకారులు వేసిన పెయింటింగ్ పలువురిని ఆకట్టుకుంది.
కరోనాపై చిత్రం.. వ్యాప్తి నివారణే ధ్యేయం.. - కృష్ణా జిల్లా వార్తలు
రాష్ట్రంలో కరోనా రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిపై పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరంలో పోలీసుల ఆధ్వర్యంలో చిత్రకారులు కరోనా వ్యాప్తిపై చిత్రాలు గీశారు.

కరోనా చిత్రంలో అవగాహన