కృష్ణా జిల్లా నాగాయలంకలో తొలి కరోనా మరణం నమోదైంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో మృతి చెందాడని అధికారులు ప్రకటించారు. అయితే ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితిలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు, అధికారులు మానవతా దృక్పథంతో పీపీఈ కిట్లు ధరించి... మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు.
కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే
కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సైతం ముందుకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో ఓ శాసనసభ్యుడు మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా మృతునికి అంత్యక్రియలు నిర్వహించి భేష్ అనిపించుకున్నారు.
మానవత్వాన్ని చాటుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే