కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా ఉద్ధృతి తగ్గటం లేదు. నియోజకవర్గంలో కొత్తగా 449 మంది కరోనా బారిన పడగా.. మరో 24 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గ్రామంలో కొన్ని చోట్ల శానిటైజేషన్ చేయకపోవటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దివిసీమలో కోడూరు, నాగాయలంక మండలాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నా.. భయంభయంగా కూలీలు పొలం పనుల్లో పాల్గొంటున్నారు.
అవనిగడ్డలో తగ్గని కరోనా ఉద్ధృతి - avanigadda corona update
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
![అవనిగడ్డలో తగ్గని కరోనా ఉద్ధృతి avanigadda corona update](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8684766-71-8684766-1599280789078.jpg)
అవనిగడ్డలో తగ్గని కరోనా ఉద్ధృతి
అవనిగడ్డ నియోజకవర్గంలో కొత్తగా నమోదైన కరోనా కేసులు
మండలం | మెుత్తం కేసులు | కోలుకున్నవారు | ఆక్టివ్ కేసులు | మరణించిన వారు |
ఘంటసాల | 36 | 29 | 6 | 1 |
చల్లపల్లి | 125 | 78 | 41 | 6 |
కోడూరు | 23 | 11 | 12 | 0 |
నాగాయలంక | 83 | 49 | 30 | 4 |
మోపిదేవి | 84 | 26 | 56 | 2 |
అవనిగడ్డ | 98 | 43 | 44 | 11 |
మెుత్తం | 449 | 236 | 189 | 24 |
ఇదీ చదవండి:నెల్లూరు జిల్లా: హాజరత్ మస్తాన్ వలి బాబా దర్గాలో వింత