ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం పడిగాపులు - వైఎస్సార్ చేయూత వార్తలు

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం అర్జీదారులు.. తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉన్నందున అర్జీదారులు ఆందోళన చెందుతున్నారు.

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం అర్జీదారుల పడిగాపులు
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం అర్జీదారుల పడిగాపులు

By

Published : Jul 6, 2020, 4:45 PM IST

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం అర్జీదారులు తహసీల్దార్, మీసేవ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి ఈ నెల 7వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుండటంతో అర్జీదారుల్లో ఆందోళన నెలకొంది. తహసీల్దార్ కార్యాలయాల్లో రెవిన్యూ డిపార్ట్​మెంట్ సర్వర్లు పని చేయకపోవడంతో సర్టిఫికెట్స్ మంజూరుకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు అంటున్నారు. పత్రాలు మంజూరు చేసేందుకు మూడు షిప్టుల్లో 24 గంటలు పని చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.

పెండింగ్​లో ఉన్న కులధ్రువీకరణ పత్రాలు

మండలం కులధ్రువీకరణ పత్రాలు
మోపిదేవి 1800
అవనిగడ్డ 400
కోడూరు 1800
చల్లపల్లి 420
ఘంటసాల 100
నాగాయలంక 5

ఇదే స్థాయిలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కూడా పెండింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి :పుట్టుకతోనే కిడ్నీ లేదు.. అయినా పని మానలేదు!

ABOUT THE AUTHOR

...view details