కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో కరోనా నివారణ చర్యలపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవనిగడ్డ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా వ్యాప్తి కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావద్దని రెడ్ క్రాస్ సొసైటీ అవనిగడ్డ శాఖ చైర్మన్ వంగర శేషగిరిరావు చెప్పారు. ప్రజలు మాస్కును తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. పిల్లలు, వృద్ధులు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. ప్రజలు తరచూ వారి చేతులను సబ్బులతో శుభ్రం చేసుకోవాలని తెలిపారు.
'పిల్లలు, వృద్ధులు ఇంటికే పరిమితమవ్వండి'
కరోనాపై ప్రజలు అప్రమత్తత కలిగి ఉండాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవనిగడ్డ శాఖ చైర్మన్ వంగర శేషగిరిరావు తెలిపారు. మోపిదేవి గ్రామంలో కరోనా నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
కరోనా నివారణ చర్యలపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవనిగడ్డ శాఖ అవగాహన సదస్సు