ప్రక్షాళన అంటే వ్యవస్థలను నాశనం చెయ్యడమే అని.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త భాష్యం చెబుతున్నారంటూ.. తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు ఏ.వి రమణ వ్యాఖ్యానించారు. తితిదేలో ఒక ఉద్యోగి ఆత్మహత్యకు కారణమై, ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనలు చేసిన తరువాత... విధుల నుంచి తొలగించిన అధికారి ధర్మారెడ్డిని... తిరిగి కుర్చీలో కూర్చోబెట్టారంటూ మండిపడ్డారు. ''మీరు ప్రక్షాళన మొదలుపెట్టారు... ఇక తితిదేను దేవుడే కాపాడుకోవాలి'' అంటూ ట్వీట్ చేశారు.
'ప్రక్షాళన' నుంచి.. తితిదేను దేవుడే కాపాడుకోవాలి'! - ttd board
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్పై తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు ఏ.వి. రమణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
తితిదే