ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో వర్కర్స్ యూనియన్ స్టాండ్ ప్రారంభంలో ఉద్రిక్తత - ysrcp, bjp fight to auto stand news update

విజయవాడ అయోధ్యనగర్​లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆటో వర్కర్స్ యూనియన్ స్టాండ్ ప్రారంభంలో భాజపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆటో స్టాండ్ ప్రారంభాన్ని వైకాపా అధికార బలంతో అడ్డుకుంటోందని.. భాజపా నాయకులు వంగవీటి నరేంద్ర తప్పబట్టారు.

Auto Workers Union stand start
ఆటో వర్కర్స్ యూనియన్ స్టాండ్ ప్రారంభం

By

Published : Nov 5, 2020, 4:46 PM IST

విజయవాడ అయోధ్యనగర్​లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆటో వర్కర్స్ యూనియన్ స్టాండ్ ప్రారంభం.. భాజపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తంగా మారింది. వైకాపా శ్రేణులు జెండాలతో స్టాండ్ ప్రారంభాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారని భాజపా నేతలు ఆరోపించారు. పోలీసులు వైకాపా నేతలను నిలువరించారు.

స్టాండ్ ప్రారంభించేందుకు తమకు అనుమతి ఉన్నా.... వైకాపా అధికారం బలంతో అడ్డుకోవడానికి ప్రయత్నించిందని.. ఇది సిగ్గుమాలిన చర్య అని భాజపా నాయకులు వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. అభద్రతా భావంలో ఉండటం వల్లే వైకాపా... కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందని ఆరోపించారు. స్టాండ్ ప్రారంభించి తీరతామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details