కేంద్రం తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్ట సవరణను అనుసరించి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 21ను రద్దు చేయాలని విజయవాడ ధర్నా చౌక్‌లో ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. మోటారు రంగాన్ని ఉపాధిగా చేసుకుని జీవిస్తున్న తమపై జరిమానాల పేరుతో ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే జీవో 21ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఆదుకోవాల్సిన వాళ్లే జీవోలతో మరింత ఇబ్బందులు పెట్టడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు.