ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హామీలు అమలు చేయలేక ప్రజలపై భారం మోపుతున్నారు'

విజయవాడలో ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. నూతన మోటార్ వెహికిల్ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హామీలను అమలుచేయలేక ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు.

auto union protest in vijayawada
విజయవాడలో ఆటో యూనియన్ రాష్ట్ర సదస్సు

By

Published : Dec 2, 2020, 4:04 PM IST

నూతన మోటార్ వెహికిల్ చట్ట సవరణకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21తో భారాలు మోపడం దారుణమని ప్రగతిశీల ఆటో కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ అన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... ఆటో కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో సమావేశం నిర్వహించారు.

ఏ రాష్ట్రంలో అమలు చేయని ఇలాంటి చట్టాన్ని.. మన రాష్ట్రంలో అమలు చేయడం దారుణమని సంఘం కన్వీనర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయలేక ప్రజలపై భారం మోపడం తగదని చెప్పారు. వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన మరుసటి రోజే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి మరో భారం వేశారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details