కృష్ణా జిల్లా వత్సవాయి మండలం ఖమ్మంపాడు గ్రామ సమీపంలోని కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి మున్నేరు కాలవలో బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో పది మందికి గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు. చికిత్స కోసం క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మున్నేరు కాలువలో ఆటో బోల్తా.. పదిమంది కూలీలకు గాయాలు - వత్సవాయి మండలం
కృష్ణా జిల్లా వత్సవాయి మండలం ఖమ్మంపాడు గ్రామ సమీపంలోని కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి మున్నేరు కాలువలో పడింది. ఆటోలో ఉన్న పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మున్నేరు కాలువలో ఆటో బోల్తా