ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీవ్ర ఇబ్బందుల్లో ఆటో కార్మికులు - live updates of corona virus in andhrapradesh

లాక్​డౌన్​ కారణంగా రోజువారి కూలీలు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అందులో ఆటోడ్రైవర్ల పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా యువత ఆటోలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. లాక్​డౌన్​తో విధించిన ఆంక్షల వల్ల సంపాదన లేక.. ఈఎమ్ఐలు కట్టలేక​ వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

auto drivers facing problems due to lock down
తీవ్ర ఇబ్బందుల్లో ఆటో కార్మికులు

By

Published : Apr 11, 2020, 2:33 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనేక మంది ఉపాధి కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అందులో ఆటో డ్రైవర్ల పరిస్థితి అయోమయంగా మారింది. బస్సు సౌకర్యం లేని చాల ప్రాంతాల్లో ప్రజలు పూర్తిగా ఆటోల్లో ప్రయాణానికి అలవాటు పడ్డారు. ప్రతి గ్రామంలో సగటున పది మంది ఆటోలపై జీవనోపాధి పొందుతున్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి.. ఆటోవాలాలకు కష్టాలు మొదలయ్యాయి. చదువుకున్న నిరుద్యోగ యువత అధికంగా ఉన్న ఈరంగంలో పనిలేక ఆర్థిక సమస్యలు ఎక్కువై కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు.

రేషన్‌ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం, కందిపప్పు అందించినా వీరిలో ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు అయినందున రేషన్‌కార్డులు లేక ఆ సాయాన్ని పొందలేకపోయారు. వీరిలో 80 శాతం ఫైనాన్స్‌ తీసుకుని ఆటోలు కొన్నవారే. వీటి ఈఎంఐలను చెల్లించాలని ప్రయివేటు ఫైనాన్సియర్లు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈగడ్డు పరిస్థితుల్లో గతంలో మాదిరిగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని ఆటోడ్రైవర్లు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details