లాక్‌డౌన్ కారణంగా ఆటో కార్మికుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఆటోలు ఉంటే సుమారు 10 లక్షల కుటుంబాలు ఆటోల ద్వారా లభించే ఉపాధిపై ఆధారపడి ఉంటున్నాయి. గత నెల రోజుల నుంచి ఆటోలను బయటకు తీసే పరిస్థితి లేకపోవటం వల్ల నెలవారీ బ్యాంకు వాయిదాలతో వాహనం కొనుక్కున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆటో డ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడుతున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని యూనియన్ నాయకులు చెబుతున్నారు. తమ కష్టాలు ప్రభుత్వానికి తెలిపేందుకు ప్రతిరోజూ వీలు దొరికిన చోట నిరసన తెలియజేస్తున్నామంటున్న యూనియన్ నేతలతో మా ప్రతినిధి ముఖాముఖి..!
బతుకు బండి ఆగింది.. జీవనం భారంగా మారింది.. - auto union problems due to lockdown period
కరోనా వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా దివాళా తీశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీ తరహాలో ప్రతి ఆటో కార్మికునికి రూ.5 వేలు ఇవ్వాలని కోరుతున్నారు.
బతుకు బండి ఆగింది.. జీవనం భారంగా మారింది..