ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయం కోసం పేదల ఇళ్లను కూల్చేశారు - కృష్ణా జిల్లా వార్తలు

సచివాలయ నిర్మాణం కోసం పేదల ఇళ్లను కూల్చేశారు ప్రభుత్వ అధికారులు. ఈ సంఘటన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో చోటుచేసుకుంది.

ventrapragada
వెంట్రప్రగడ గ్రామంలో గ్రామస్థుల ఆందోళన

By

Published : Aug 26, 2020, 11:46 AM IST

కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో గ్రామ సచివాలయం కోసం... పేదల నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వానికి చెందిన భూమిలో సచివాలయ నిర్మించ తలపెట్టిన అధికారులు...అక్కడ కొన్నేళ్లుగా నివాసముంటున్న పేదల గృహాలను స్థానిక నేతలతో కలిసి జేసీబీతో కూల్చి వేశారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా.. తాము నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం దారుణమని బాధితులు అధికారులపై మండిపడ్డారు. రెక్కాడితే గాని డొక్కాడని తమని కట్టుబట్టలతో రొడ్డుపై పడవేశారని కన్నీటి పర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details