ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంక్​ రికార్డు గదిలో అటెండర్​ ఆత్మహత్య - attender commit suicide at bank in gudiwada

కృష్ణా జిల్లా గుడివాడ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్​లో అటెండర్ రవి ఆత్మహత్య చేసుకున్నాడు. రికార్డుల గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Attender commits suicide in bank record room gudiwada
Attender commits suicide in bank record room gudiwada

By

Published : Feb 8, 2021, 4:31 PM IST

కృష్ణా జిల్లా గుడివాడలోని కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అటెండర్ రెడ్డి రవి... బ్యాంకు రికార్డు రూములో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవి గుడివాడ అర్బన్ బ్యాంకు బ్రాంచ్​లో మూడు సంవత్సరాలుగా అటెండర్​గా విధులు నిర్వర్తించాడు. రోజూలానే విధులకు హాజరయ్యాడు. బ్యాంక్​ రికార్డు గదిలోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గుర్తించిన ఇతర సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వ్యక్తిగత కారణాలతోనే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గుడివాడ వన్​టౌన్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details