ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం ప్రోద్భలంతోనే చంద్రబాబుపై దాడులు: కళా - మాజీ మంత్రి కళా వెంకట్రావు తాజా వార్తలు

సీఎం జగన్ అండదండలతోనే తెదేపా చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిందని కళా వెంట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికలో వైకాపా ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

సీఎం ప్రోద్భలంతోనే చంద్రబాబుపై దాడులు : కళా
సీఎం ప్రోద్భలంతోనే చంద్రబాబుపై దాడులు : కళా

By

Published : Apr 13, 2021, 3:23 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే చంద్రబాబుపై రాళ్లదాడి జరిగిందని మాజీ మంత్రి కళా వెంకట్రావు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్ని దాడులు చేసినా తిరుపతి లోక్​సభలో వైకాపాకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అధికార పార్టీ అవలంభిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగానికి రాళ్ల దాడే సాక్షమని మండిపడ్డారు.

'చేతకాక'

తమ పనితీరుతో రాష్ట్ర ప్రజలను మెప్పించి ఓట్లు పొందడం చేతగాక.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా అధినేత సభలకు తగిన రక్షణ కల్పించాలని పోలీస్ శాఖను కోరారు.

ఇవీ చూడండి : ఈసీ నిషేధంపై దీదీ నిరసన

ABOUT THE AUTHOR

...view details