ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Attack: జడ్పీటీసీ ఇంటిపై దాడి.. కారణం అదేనా..? - పెనుగంచిప్రోలు జడ్పీటీసీ ఇంటిపై దాడి తాజా వార్తలు

కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు జడ్పీటీసీ వూట్ల నాగమణి ఇంటిపై దాడి జరిగింది. తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. ఓ వ్యక్తి ఇనుప రాడ్ తో వచ్చి కిటికీ అద్దాలను ధ్వంసం చేస్తూ భయబ్రాంతులకు గురి చేశాడని.. నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

attack on penugranchiprolu zptc nagamani house
జడ్పీటీసీ ఇంటిపై దాడి.. ఆర్థిక లావాదేవీలే కారణమా..?

By

Published : Oct 31, 2021, 5:03 PM IST

పెనుగంచిప్రోలు జడ్పీటీసీ ఇంటిపై దాడి

కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు జడ్పీటీసీ వూట్ల నాగమణి ఇంటిపై దాడి జరిగింది. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన దివ్వెల హరీష్ కుమార్ అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు.. నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇనుప రాడ్ తో వచ్చి కిటికీ అద్దాలను ధ్వంసం చేసి, భయబ్రాంతులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. హరీష్ కుమార్ తో ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయని.. అవి కోర్టులో కేసులు నడుస్తున్నాయని ఆమె చెప్పారు. దాడికి పాల్పడిన హరీష్ కుమార్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details