ATTACKED: జనసేన సమన్వయకర్త కారుపై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం - attack on yadlapally Ramsudheer car at pedana
జనసేన సమన్వయకర్త యడ్లపల్లి రామ్‌సుధీర్ కారుపై దాడి
07:37 September 25
పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్త యడ్లపల్లి రామ్‌సుధీర్ కారుపై దాడి
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్త యడ్లపల్లి రామ్‌సుధీర్ కారుపై దాడి జరిగింది. దుండగులు ఆయన కారును ధ్వంసం చేశారు. రాళ్లతో కారు అద్దాలను పగులగొట్టారు. పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి..
Last Updated : Sep 25, 2021, 2:47 PM IST
TAGGED:
vja car - breaking