ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫుడ్​ ఆర్డర్​ లేట్​ అయిందని... డెలివరీ బాయ్‌పై దాడి - హైదరాబాద్ తాజా వార్తలు

Attack on food delivery boy: హైదరాబాద్ హుమాయున్‌నగర్‌లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఆర్డర్‌ ఆలస్యం అయిందని ఫుడ్‌ డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో బాధితుడితో పాటు మరో ముగ్గురిపై వేడినూనె పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 3, 2023, 5:46 PM IST

Attack on food delivery boy: హైదరాబాద్‌ నగరంలోని హుమాయున్‌నగర్‌లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఆర్డర్‌ లేట్ అయిందని, ఫుడ్‌ డెలివరీ బాయ్‌పై విచక్షణరహితంగా దాడికి దిగాడు. తన 15 మంది అనుచరులతో కలిసి వచ్చి ఓ హోటల్‌ వద్ద భయానక వాతవరణం సృష్టించాడు. భయంతో సదరు ఫుడ్‌ డెలివరీ బాయ్‌ హోటల్‌లోకి పరుగులు తీయగా, వారు సైతం హోటల్‌లోకి దూసుకెళ్లి మరీ బాధితుడిపై దాడి చేశారు. ఈ క్రమంలో మరిగే నూనె మీద పడడంతో ఫుడ్‌ డెలివరీ బాయ్‌తో పాటు నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు

ABOUT THE AUTHOR

...view details