ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Attack: తమ్ముడు ప్రేమించిన అమ్మాయిపై.. అక్క దాడి! - women attacked news

తమ్ముడు ప్రేమించిన యువతిపై అక్క దాడికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగింది. వేరే కులానికి చెందిన అమ్మాయి కావటంతో పలుమార్లు తన తమ్ముడిని వదిలేయాలని హెచ్చరించినా వినకపోవడమే... దాడికి కారణమైంది.

attack on a young women
యువతిపై అక్క దాడి

By

Published : Jun 24, 2021, 3:31 PM IST

తమ్ముడు వేరే కులానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అక్క ఆగ్రహం చెందింది. అతడి ప్రేమికురాలిపై ఆ అక్క దాడి చేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటు చేసుకుంది. గాయపడిన యువతి.. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు మనీషా బట్టల దుకాణంలో పనిచేస్తోంది.

తన తమ్ముడిని వదిలేయాలంటూ అలివేలు మంగతాయారు పలుమార్లు మనీషాని హెచ్చరించింది. అయినా ఆమె.. మాట వినలేదు. తన తమ్ముడికి మనీషాతో వివాహం జరిగితే... వేరే కులస్థురాలైన అమ్మాయికి ఆస్తి పోతుందనే భయంతో అలివేలు.. ఈ దాడికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details