కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన షేక్ కొండ అనే వ్యక్తిపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. విజయవాడ నుంచి ఆటోలో కూరగాయలు తీసుకొని నందిగామ వైపు వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెంబడించారు. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఓ వివాదం విషయంలో దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:కత్తితో విమానాశ్రయంలోకి గర్భిణీ.. కారణం?
ముఖానికి ముసుగులు ధరించిన నిందితులు.. కంచికచర్ల గ్రామం వద్దకు రాగానే ఆటోపై పెద్దరాళ్లు విసిరి అడ్డుకున్నారు. దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన బాధితుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
తక్కువ వడ్డీకే రుణాలిప్పిస్తానని మోసం..రూ.4.5 కోట్లకు టోపీ