BJP and TRS attacks: మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలివెలలో ఓ వైపు భాజపా, మరోవైపు తెరాస ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పిడిగుద్దులతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. భాజపా ప్రచార కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పైనా రాళ్ల దాడి జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇంత ఉద్రిక్తత చోటు చేసుకున్నా.. పోలీసులు చోద్యం చూస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఈ ఘటనలో పలువురు గన్‌మెన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. ములుగు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్‌కు గాయాలయ్యాయి.
పలివెలలో ఉద్రిక్తత.. భాజపా-తెరాస కార్యకర్తల మధ్య పరస్పరం దాడి - Telangana latest news
BJP and TRS attacks: తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక సంరంభం తారాస్థాయికి చేరింది. పలివెలలో భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.
తారాస్థాయికి మునుగోడు