కృష్ణా జిల్లా నందిగామ ఘటనలో ఏ తప్పు చేయకున్నా 20 మంది విద్యార్థి సంఘాల నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెదేపా నేత తంగిరాల సౌమ్య అన్నారు. వైకాపా ఎంపీ నందిగం సురేష్‌ను అమరావతికి మద్దతు ఇవ్వాలని మాత్రమే వారు కోరారని వెల్లడించారు. అంతేకానీ వారు ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. కేసులకు నిరసనగా మంగళవారం నిరాహార దీక్ష చేయనున్నట్లు సౌమ్య తెలిపారు.