అట్లతద్ది పర్వదినాన్ని కృష్ణా జిల్లా వ్యాప్తంగా మహిళలు కలిసి వైభవంగా నిర్వహించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండగను మరింత సంబరంగా చేసుకున్నారు. మహిళలు.. ముఖ్యంగా గృహిణులు అంతా ఒక్కచోట చేరి వేడుక చేసుకున్నారు. గోరింటాకు పెట్టుకున్నారు. ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. రకరకాల పిండి వంటలు తయారు చేశారు. చెరువుల్లో, కాలువల్లో దీపాలను వదలారు. ఊయలలూగారు. పెళ్లికాని యువతులు గౌరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కృష్ణా జిల్లాలో ఘనంగా అట్లతద్ది - అట్ల తద్ది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకుంటారు
అట్లతద్ది పండగను.. విజయవాడలో మహిళలు ఘనంగా నిర్వహించారు. వాయనాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు.
విజయవాడలో అట్ల తద్ది వేడుకలు