ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుబ్బయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: అచ్చెన్నాయుడు - తెదేపా నేత హత్యపై అచ్చెన్న ధ్వజం వార్తలు

కడప జిల్లాలో తెదేపా నేత హత్య పట్ల తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ విధంగా జరగటం... రాష్ట్రలో ఉన్న శాంతిభద్రతలకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.

atchennaidu
అచ్చెన్నాయుడు

By

Published : Dec 29, 2020, 1:20 PM IST

అచ్చెన్నాయుడు విడుదల చేసిన ప్రకటన

సీఎం సొంత జిల్లాలో తెదేపా నేత హత్య.. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలకు అద్దం పడుతోందని, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కడప జిల్లాలో తెదేపా నేత నందం సుబ్బయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.

19 నెలల జగన్ పాలనలో.. రాష్ట్రంలో హింస జరగని రోజంటూ లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కత్తులు, కర్రలు, మారణాయుధాలతో పాలిస్తారా అని నిలదీశారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో హత్యా రాజకీయాలకు తెర తీశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పాలనలో ఇంకెన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details