ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మందుబాబుల వీరంగం... ఎక్సైజ్ కానిస్టేబుళ్లపై దాడి - ఎక్సైజ్ కానిస్టేబుళ్లపై మందుబాబుల దాడి

ఫూటుగా మద్యం తాగిన ఇద్దరు.. మఫ్టీలో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుళ్ల​పై దాడికి దిగారు. పైగా వారిద్దరూ తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. హైకోర్టు తీర్పు ఇచ్చిందిగా మద్యం తెచ్చుకోమని అంటూ పోలీస్ స్టేషన్​లో వీరంగం సృష్టించారు.

assault on constable
మందుబాబుల వీరంగం

By

Published : Sep 3, 2020, 3:27 PM IST

మందుబాబుల వీరంగం

కృష్ణా జిల్లా మైలవరంలో తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రావాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు యువకులు.. మఫ్టీలో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లపై దాడికి దిగారు. అటుగా వెళ్తున్న మెుబైల్ రోడ్ సేఫ్టీ కానిస్టేబుళ్లు వారిని అదుపులోకి తీసుకుని మైలవరం పోలీస్ స్టేషన్​కి తరలించారు. అసలకే ఇద్దరూ ఫూటుగా మద్యం సేవించి ఉన్నారేమో.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా మద్యం తాగామనీ.. హైకోర్టు మద్యం తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చిందంటూ హల్​చల్ చేశారు. నిందితులిద్దరూ ఇబ్రహీంపట్నంకి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details