విజయవాడ బీసెంట్ రోడ్డులో ఘర్షణ జరిగింది. జ్యూస్ దుకాణం, చెప్పుల వ్యాపారుల మధ్య ఈ ఉదయం చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో పరస్పరం రాళ్ల దాడి చేసుకోగా.. నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. చెప్పులు వేసుకుని దుకాణంలోకి రావద్దని, చెప్పుల దుకాణదారుడిని పండ్ల రసాల వ్యాపారి అడ్డుకోవటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు.
విజయవాడలో ఘర్షణ...పోలీసుల అదుపులో ఎనిమిది మంది - విజయవాడ నేర వార్తలు
విజయవాడ బీసెంట్ రోడ్డులో దుకాణదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
![విజయవాడలో ఘర్షణ...పోలీసుల అదుపులో ఎనిమిది మంది assault in vijayawada eight member are police handover](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8896994-478-8896994-1600782128033.jpg)
ఘర్షణలో రాళ్లు రువ్వుతున్న వ్యక్తి