ఎనిమిది నెలలుగా తమకు రావాల్సిన జీతాలను తక్షణమే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్లు 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారంలోకి వచ్చాక ప్రకటించిన పది వేల రూపాయల వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని, వేతనం అమలులో ఏ, బీ, సీ కేటగిరీలు లేకుండా అందరికీ సమానంగా 10 వేల వేతనం ఇవ్వాలని విజయవాడలో డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 'ఛలో విజయవాడ' కార్యక్రమం చేపడితే ముందుగానే గృహ నిర్బంధం చేయడం ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు.
ఆశావర్కర్ల 'ఛలో విజయవాడ'..జీతాలు చెల్లించాలని డిమాండ్
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్ల 'ఛలో విజయవాడ' కార్యక్రమం చేపట్టారు. 8 నెలలుగా రావాల్సిన జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల ఆశావర్కర్ల అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
darna
కడప కలెక్టరేట్ ఎదుట ఆశావర్కర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోలీస్ స్టేషన్‌లో ఆశా వర్కర్లతో కలిసి ఎమ్మెల్యే రామానాయుడు ధర్నా నిర్వహించారు. అరెస్ట్ చేసిన ఆశావర్కర్లను వెంటనే ఇంటికి పంపాలని డిమాండ్ చేశారు.