ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవోపేతంగా ఆర్యవైశ్యుల కార్తిక వనసమారాధన - నందిగామ వనసమారాధనలో పాల్గొన్న వందలాది ఆర్యవైశ్యులు

కృష్ణాజిల్లా నందిగామలో ఆర్యవైశ్యుల కార్తిక వన సమారాధన వైభవోపేతంగా జరిగింది. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పలువురు జంటలు పాల్గొని.. పూజాధికాలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

arya vysya karthika vana samaradhana
కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఆర్యవైశ్యులు

By

Published : Dec 13, 2020, 8:29 PM IST

వాసవీ మార్కెట్ కార్తిక వన సమారాధనను.. కృష్ణాజిల్లా నందిగామలో గణేష్ ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహించింది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది ఆర్య వైశ్యులు, వ్యాపారులు.. కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. స్థానిక మున్నేరు పక్కన మామిడి తోటలో.. నిర్వహకులు సంప్రదాయబద్దంగా ఉత్సవాలను జరిపారు.

ఉసిరి చెట్టు కింద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. పలువురు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. పిల్లలతో కలిసి ఆడి, పాడి సందడి చేశారు. కొన్నేళ్ల నుంచి క్రమం తప్పకుండా ఈ వన సమారాధనను ఆర్యవైశ్యులు నిర్వహిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details